
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. మరోవైపు నెక్స్ట్ ఏం మూవీ చేస్తాడా అని ఇప్పటినుంచే కొన్నిపేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో తమిళ దర్శకుడు మిత్రన్ పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న రూమర్లపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది.
తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్-నాగచైతన్య కాంబినేషన్‌లో ఓ స్పై డ్రామా సినిమా తీసేందుకు సన్నాహాలు మొదలయ్యాయని కోలీవుడ్ నుంచి సమాచారం వచ్చింది. అయితే చైతూ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం అలాంటివే లేవని తెలుస్తోంది. తమిళంలో 'ఇరంబుదురై' (తెలుగులో 'అభిమన్యుడు'), 'సర్దార్' లాంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు పీఎస్ మిత్రన్. ఒకవేళ ఈయనతో చైతూ సినిమా చేస్తే బాగానే ఉంటుంది. మరి భవిష్యత్తులో కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.