breaking news
Sumo Didi Movie
-
సుమో దీదీ బయోపిక్
లావుగా ఉన్న శరీరాన్నిఆమె అవమానంగా భావించలేదు. ఆయుధం చేసుకుంది. ముంబై స్లమ్స్‌లో పుట్టి పెరిగిన హెతల్ దవే తన స్థూలకాయం వల్ల మాటలు పడింది. అవమానాలు మోసింది. కాని ఆ శరీరాన్ని ఆమె సుమో రెజ్లింగ్ కోసం తీర్చిదిద్దడమే కాదు జపాన్ వరకూ వెళ్లి సుమోలతో కలబడింది. గెలిచింది. ఆమె కథ ఇప్పుడు ‘సుమో దీదీ’ బయోపిక్‌గా స్ట్రీమ్ అవుతూ బాడీ షేమింగ్‌కు గుణపాఠంగా నిలిచింది.ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె ఒకే మాట వింది... ‘ఏయ్... మోటీ’... అంటే ‘లట్టు దానా’ అని అర్థం. ఆమెకో పేరు ఉంది. హెతల్. కాని ఆ పేరు పిలిచేవారే లేరు. ‘మోటీ.. మోటీ’... తనంటే తన శరీరమేనా? ఈ శరీరానికి మించిన గుర్తింపు తను తెచ్చుకోలేదా అనుకుంది హెతల్. ఆ తర్వాత ఆమె సుదీర్ఘ ప్రయాణం నేటి బయోపిక్ వరకూ కొనసాగింది.వార్తల్లో బయోపిక్‘సుమో దీదీ’ ఇదీ సినిమా పేరు. అది జనం బాడీ షేమింగ్ చేస్తూ పెట్టిన పేరు కాదు. సుమోలో విజయం సాధించినందుకు హెతల్ దవేను ప్రేమగా పిలుచుకునే పేరు. అదే ఆమె సినిమాకు టైటిల్ అయ్యింది. నిజానికి వెండితెరపై క్రీడాకారుల బయోపిక్‌లు రావడం కొత్తేమీ కాదు. కానీ ముంబై స్లమ్స్ అమ్మాయి, అసలు మన దేశంలో ఉనికిలోనే లేని ‘సుమో రెజ్లింగ్’లో ప్రపంచ వేదికపై దేశం తరఫున నిలబడటం... అదీ జర్నీ అంటే. మూడు నాలుగు రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఇన్సి్పరేషనల్ స్టోరీగా నిలిచింది.స్లమ్స్ అమ్మాయిముంబైలోని స్లమ్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెరిగిన హెతల్కు చిన్నప్పటి నుంచి జూడో, మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. అయితే ఆమె శరీర ఆకృతి, బరువుపై చాలా జోకులు ఎదురయ్యేవి. ‘అమ్మాయివి... మార్షల్ ఆర్ట్స్‌లోకి వెళతావా? అసలు లావుగా ఉంటే పెళ్లెలా అవుతుంది? ముందు ఆ సంగతి చూసుకో’ అన్న బాడీ షేమింగ్ చుట్టుముట్టింది. కానీ హెతల్ ఆ అవహేళనలను ఎదుర్కోవాలనుకుంది. ఇంటర్నెట్ కేఫ్‌లో కూచుని నా శరీరానికి తగ్గ ఆట ఏమిటి అని అడిగితే సుమో రెజ్లింగ్ అని వచ్చింది. అయితే ఎన్నో సందేహాలు. సుమోలో స్త్రీలు ఉన్నారా... జపాన్ వారితో తాను పోటీ పడొచ్చా... అన్నీ మెయిల్స్ రాసి సందేహాలు తీర్చుకోవడమే. చివరకు అదే తన మార్గం అని నిశ్చయించుకుంది. అయితే మన దేశంలో సుమో రెజ్లింగ్‌కు అసోసియేషనే లేదు, కోచ్‌లు లేరు, కనీసం ప్రాక్టీస్ చేయడానికి సుమో రింగ్ (దోహ్యో) కూడా లేదు. ఒక పక్క సమాజం మాటల తూటాలు విసురుతుంటే, మరోపక్క వనరులు లేని శూన్యంలో హెతల్ తన ఒంటరి పోరాటం ప్రారంభించింది.జపాన్ రింగ్‌లో త్రివర్ణ పతాకం‘మొదట మా అన్న తర్వాత మా నాన్న తోడుగా నిలిచారు’ అంటుంది హెతల్. ఆమె పెళ్లికి దాచిన కొద్ది పాటి బంగారాన్ని తండ్రి అమ్మేసి ‘నీ శిక్షణకు ఈ డబ్బువాడు’ అన్నాడు. అన్న ముంబైలోని ఓవల్ మైదాన్‌లోనే ఆమెకు రింగ్ ఏర్పాటు చేసి ఇంటర్నెట్ చూస్తూ తనే కోచ్‌గా మారాడు. దాంతో హెతల్ పురుషుల ఆధిపత్యం, కఠినమైన సాంప్రదాయాలు ఉండే సుమో రింగ్‌లోకి సింహంలా దూకింది. మెల్లమెల్లగా జపాన్ సంప్రదాయాలను ఔపోసన పట్టి, సరైన స్పాన్సర్షిప్ లేకపోయినా తన సొంత ఖర్చులతో అంతర్జాతీయ టోర్నమెంట్లకు వెళ్ళింది. 2008లో జరిగిన ప్రపంచ సుమో పోటీలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఏకంగా ప్రపంచ ఐదో ర్యాంకు సాధించి గ్లోబల్ రికార్డు సృష్టించింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సమాజం దేన్నయితే బలహీనత అందో, దాన్నే తన గ్లోబల్ సక్సెస్‌గా మార్చి చూపించింది.స్క్రీన్ పైకి ‘సుమో దీదీ’హెతల్ దవే సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని అంతే సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు జయంత్ రోహత్గీ. ఈ బయోపిక్‌లో హెతల్ పాత్రను పోషించే బాధ్యతను బాలీవుడ్ నటి శ్రియమ్ భగ్నాని తీసుకుంది. గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఒక సుమో రెజ్లర్ బాడీ లాంగ్వేజ్‌ను మ్యాచ్ చేయడం శ్రియమ్కు అతి పెద్ద సవాలుగా మారింది. ఈ పాత్ర కోసం ఆమె ఏకంగా 14 కేజీల బరువు పెరిగింది. కేవలం బరువు పెరగడమే కాకుండా, నెలల తరబడి ప్రొఫెషనల్ సుమో శిక్షకుల వద్ద కఠినమైన రెజ్లింగ్ పద్ధతులు, సుమో ఫైట్ సీక్వెన్స్ లు నేర్చుకుంది. స్క్రీన్ పై శ్రియమ్ పడే ప్రతి కష్టం, రియల్ లైఫ్ హెతల్ పడ్డ శ్రమను కళ్లకు కట్టేలా చేసింది.‘సుమో దీదీ’ కేవలం ఒక క్రీడాకారిణి బయోపిక్ మాత్రమే కాదు... అది ప్రతి అమ్మాయి ఆత్మగౌరవ ప్రయాణం. బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటూ, సమాజం గీసిన గీతలను దాటాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ కథ ఒక టార్చ్ లైట్. ఓటీటీలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అస్సలు మిస్ అవ్వకూడని ‘మస్ట్ వాచ్’ ఫీచర్ స్టోరీ ఇది! -
ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. అలానే వచ్చినవన్నీ కూడా చిన్న చిత్రాలు. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఉన్నంతలో కాస్త చూడదగ్గ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఒక్కరోజే 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో ప్యారడైజ్, డోరతి, ధూమకేతు, ఐ యామ్ హ్యాండ్సమ్, గజబ్ రాత్, సుమో దీదీ, వరం, నా వైఫ్ మిస్సింగ్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలతో పాటు సిరీస్‌లు చూడొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (అక్టోబర్ 23)అమెజాన్ ప్రైమ్ఐ యామ్ హ్యాండ్సమ్ - తెలుగు సినిమాచార్ యార్ - హిందీ సిరీస్లాల్: హాలోవీన్ సీజన్ 1 - ఇటాలియన్ సిరీస్ఫైనల్ టేబుల్ - కొరియన్ సిరీస్ (అక్టోబర్ 24)నెట్ఫ్లిక్స్ద ప్యారడైజ్ - తెలుగు సినిమాడోరతి - తెలుగు డబ్బింగ్ మూవీధూమకేతు - తెలుగు డబ్బింగ్ సినిమాల్యూపిన్ పార్ట్ 4 - తెలుగు డబ్బింగ్ సిరీస్గజబ్ రాత్ - తెలుగు డబ్బింగ్ సినిమాపొలిటికా ల్యూపిన్ సీజన్ 1 - జపనీస్ సిరీస్సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ - ఇంగ్లీష్ సిరీస్ప్యారలైజ్డ్ బై హోప్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీఫేడింగ్ గ్రాండియర్ - స్పానిష్ సిరీస్హాట్స్టార్వరం - తెలుగు సిరీస్ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్సుమో దీదీ - హిందీ సినిమాఅన్ లక్కీ మై బాస్ - కొరియన్ సిరీస్ద ఇన్వైట్ - ఇంగ్లీష్ మూవీశ్వేత్కాళీ సీజన్ 2 - బెంగాలీ సిరీస్లయన్స్ గేట్ ప్లేలెజెండ్ ఆఫ్ ద వైట్ డ్రాగన్ - ఇంగ్లీష్ సినిమాఆహానా వైఫ్ మిస్సింగ్ - తెలుగు సిరీస్(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాయదు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. అయితే అందరూ దసరా పండగ హడావుడిలో ఉన్నారు. సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్నారు. గత వీకెండ్ రిలీజైన రణబాలి, జైలర్ 2 సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి. మరోవైపు ఈ వీకెండ్.. 418, హైకూ, ప్రేమ డైరీలో, 321, జయహో రామానుజ లాంటి చిన్న చిత్రాలే విడుదల కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌లా కీర్తి.. టీజర్ రిలీజ్)మరోవైపు ఓటీటీల్లో 25కి పైగా మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రీసెంట్ హిట్స్ నాని 'ప్యారడైజ్', కీర్తి సురేశ్ 'డోరతి'తోపాటు సుమో దీదీ లాంటి చిత్రాలతో పాటు నా వైఫ్ మిస్సింగ్, వరం లాంటి తెలుగు సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 19 నుంచి 25 వరకు)హాట్స్టార్మోనా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 21వరం (తెలుగు సిరీస్) - అక్టోబర్ 22ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 23ఆహానా వైఫ్ మిస్సింగ్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 22జీ5సుమో దీదీ (హిందీ మూవీ) - అక్టోబర్ 23ద ఇన్వైట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 23సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 23నెట్ఫ్లిక్స్సైబర్ పంక్: ఎడ్జ్ రన్నర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 20సిక్స్ కింగ్స్ స్లమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21ద మదర్ ఆఫ్ పెంగ్విన్స్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) - అక్టోబర్ 21ద న్యూ స్టాన్‌ఫోర్ట్ ప్రిజన్ ఎక్స్పరీమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21ద ప్యారడైజ్ (తెలుగు సినిమా) - అక్టోబర్ 22డిడ్ సమ్‌వన్ హ్యాపెన్ టూ మెన్షన్ మీ? (జపనీస్ సిరీస్) - అక్టోబర్ 22నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 22ఫేడింగ్ గ్రాండియర్ (స్పానిష్ సిరీస్) - అక్టోబర్ 23గజబ్ రాత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 23ల్యూపిన్ పార్ట్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23ప్యారలైజ్డ్ బై హోప్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 23డోరతి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 23సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23అమెజాన్ ప్రైమ్లవ్ ఇన్ డిస్కూస్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 19ద టెర్మినల్ లిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21చార్ యార్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 23ఫైనల్ టేబుల్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 24ఆపిల్ టీవీ ప్లస్వేర్ ఈజ్ వాండా? సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
నేరుగా ఓటీటీలోకి క్రేజీ సినిమా.. మహిళలు తప్పక చూడాలి
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో రిలీజైన తర్వాత కాకుండా నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలాంటి ఓ స్ఫూర్తిదాయక చిత్రం ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ వదలడంతో పాటు స్ట్రీమింగ్ ఎప్పుడనేది కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: రజనీ 'జైలర్ 2'కే కండీషన్ పెట్టిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి)సమాజం, కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలని భరించి, తన బలహీనత అనుకున్న దాన్నే బలంగా మార్చుకుని భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్‌గా ఎదిగిన హేతల్ డేవ్ స్ఫూర్తిదాయక జీవితమే ఈ 'సుమో దీదీ'. శ్రియం భగ్నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పోర్ట్స్ బయోపిక్కు జయంత్ రోహత్గి దర్శకత్వం వహించారు.జీవితంలో ఎన్నో అవరోధాలని ఎదుర్కొంటూ మనల్ని మనం నమ్ముకుంటూ ముందుకు సాగడం ఎంత ముఖ్యమో ఈ చిత్రం అద్దం పడుతుంది. ముఖ్యంగా మహిళలు తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలి. అక్టోబర్ 23 నుండి జీ5 ఓటీటీలో ఇది హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్లో కథంతా చెప్పేశారు. మరి మూవీ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)


