'ధురంధర్' సీరియస్ కాన్సెప్ట్.. అదే కథని కామెడీగా తీస్తే? | Udta Teer Movie Trailer And Story Detail | Sakshi
Sakshi News home page

Udta Teer Movie: పాక్ ఏజెంట్ గతం మర్చిపోయి భారత్ కి వీరభక్తుడైపోతే?

Oct 13 2026 5:15 PM | Updated on Oct 13 2026 5:51 PM

Udta Teer Movie Trailer And Story Detail

గతేడాది డిసెంబరు, ఈ ఏడాది మార్చిలో రిలీజైన 'ధురంధర్' సినిమాలు దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం రేకెత్తించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ చిత్ర ప్రభావం వల్ల పాక్ పోలీసులు.. తమ దేశంలో నిజంగా గూఢచారులు ఉన్నారేమోనని తెగ వెతికేశారు. అయితే సీరియస్‌గా ఉన్న ఈ మూవీని ఒకవేళ కామెడీగా తీస్తే ఎలా ఉంటుందనేది కూడా ఓ సినిమా తీశారు. అదే 'ఉడ్తా తీర్'.

(ఇదీ చదవండి: రజనీ 'జైలర్ 2'కే కండీషన్ పెట్టిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి)

ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్స్ విడుదల చేశారు. వీటి బట్టి చూస్తే పాకిస్తాన్‌కి చెందిన ఓ గూఢచారి.. మిషన్‌లో భాగంగా భారతదేశానికి వస్తాడు. ఓ ప్రమాదంలో గతం మర్చిపోయి మన దేశానికి వీరభక్తుడు అయిపోతాడు. తర్వాత ఏం జరిగింది? అనేదే స్టోరీ.

ట్రైలర్ అయితే చూసేందుకు చాలా బాగుంది. కామెడీ కూడా వర్కౌట్ అయింది. 'ధురంధర్' తరహా కథని కామెడీగా తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించబోతున్నారు. మరి ఇది బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి క్రేజీ సినిమా.. మహిళలు తప్పక చూడాలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement