దేవుడు అంటే నమ్మేవాళ్లు ఉన్నట్లే.. నమ్మని వాళ్లు కూడా ఉంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. అయితే కొన్నిసార్లు డెస్టినీ చాలా చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ సీన్ రిపీటైంది. అసలు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేని రవితేజకు అదే దేవుడి వల్ల దాదాపు నాలుగేళ్ల తర్వాత హిట్ దక్కింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ‘ఇరుముడి’మూవీ రివ్యూ)
రవితేజ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. తండ్రీకూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి తీశారు. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన అందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా జనాలు తెగ చూస్తున్నారు.

అయితే సినిమాలో కూతురి సెంటిమెంట్ ఎంతలా ఆకట్టుకుంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూవీలో చివరి అరగంట చాలామంది ప్రేక్షకుల్ని ఏడిపించేసింది. అదే టైంలో అయ్యప్ప స్వామి నేపథ్యం, రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయ్యప్ప మాలలో రవితేజ చాలా సహజంగా కనిపించాడు. చాలామంది అయ్యప్ప భక్తులు తమని తాము ఇందులో చూసుకున్నారంటే అతిశయోక్తి లేదు.
అయితే 'ఇరుముడి'లో అయ్యప్ప భక్తుడిగా ఆకట్టుకున్న రవితేజ.. నిజజీవితంలో దేవుడిని పెద్దగా నమ్మడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా చెప్పాడు. మూడేళ్ల క్రితం 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ రిలీజ్ టైంలో హిందీలో ఓ యూట్యూబర్‌కి రవితేజ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే మాట్లాడుతూ.. 'రోజూ పూజ చేయడం, దేవుడి ప్రతిమలని ఆరాధించడం లాంటి వాటిని నేను నమ్మను. ప్రకృతే నాకు దేవుడితో సమానం' అని రవితేజ అన్నాడు. ఇప్పుడు అదే రవితేజ 'ఇరుముడి' అనే భక్తి చిత్రంతో నాలుగేళ్ల తర్వాత ఓ సక్సెస్ అందుకోవడం డెస్టినీ(విధి) అనుకోవాలేమో!
(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్‌పాట్ కొట్టిన రవితేజ)


