ముంబై టు హైదరాబాద్‌ | Allu Arjun Raaka Next Schedule Set to Begin in Hyderabad | Sakshi
Sakshi News home page

ముంబై టు హైదరాబాద్‌

Aug 24 2026 2:01 AM | Updated on Aug 24 2026 2:01 AM

Allu Arjun Raaka Next Schedule Set to Begin in Hyderabad

హైదరాబాద్‌కు రానున్నాడట రాకా. అల్లు అర్జున్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేస్తుండగా, ఇతర ప్రధాన పాత్రల్లో మృణాల్‌ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ట్రిపుల్‌ రోల్‌ చేస్తున్నారని, ఇందులో ఒకటి నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌ అని భోగట్టా. కాగా ‘రాకా’ మేజర్‌ షూటింగ్‌ ముంబైలోనే జరుగుతోంది. 

అక్కడి స్టూడియోస్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో కొంతకాలంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తున్నారట. దీనికోసం హైదరాబాద్‌ శివార్లలోని ఓ స్టూడియోలో సెట్‌ను రెడీ చేయిస్తున్నారని సమాచారం. ఈ సెట్‌ వర్క్‌ పూర్తయ్యాక అక్కడ చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్‌ సర్భ్, ఫెమినా జార్జ్, నైలా గ్రేవాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement