రవితేజ 'ఇరుముడి'కి తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఓ మాదిరి హైప్‌తోనే థియేటర్లలో రిలీజైనప్పటికీ.. తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. సెకండాఫ్‌లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ఆడియెన్స్ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి కళ్లు చెదిరే వసూళ్లు సొంతం చేసుకుంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. కలెక్షన్స్ పోస్టర్‌ని అధికారికంగా పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్‌పాట్ కొట్టిన రవితేజ)
రిలీజైన మూడు రోజుల్లో రూ.80 కోట్లకు పైగా వసూళ్లని 'ఇరుముడి' సొంతం చేసుకుందని వెల్లడించారు. టికెట్ రేట్ల పెంపు లేదు, పండగల సీజన్ కూడా కాదు. అయినా కానీ తొలి వీకెండ్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ చిత్రంగా ఇది నిలిచిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ మేరకు రెండు పోస్టర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
గత మూడు రోజులుగా అదరగొడుతున్న 'ఇరుముడి'.. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా టికెట్ బుకింగ్స్‌లో మంచి జోష్ చూపిస్తోంది. ప్రస్తుత టాక్ బట్టి చూస్తే సోమవారం నాటికి రూ.100 కోట్ల మార్క్ సులభంగా దాటేయొచ్చు. రెండు రోజుల్లో 'టాక్సిక్' రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు వసూళ్లు కాస్త నెమ్మదించే అవకాశముంది. మరి లాంగ్ రన్‌లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్)
TELUGU CINEMA IS WITNESSING ITS BIGGEST BLOCKBUSTER💥🔥
Fastest-ever 80 CR+ GROSS for a regional film 🔥
RAVANNA’S BOX-OFFICE RAMPAGE ❤️🔥
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/ENLLEXWHJo— Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2026


