చెన్నై: రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సాధారణమే.. కానీ ఇప్పుడు తమిళనాడులో దుస్తుల చుట్టూ రాజకీయ టర్న్ తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై టీవీకే మంత్రి ఎస్. కీర్తన ఘాటుగా స్పందించారు. వీడియోలో కనిపిస్తున్న మహిళ తాను కాదని క్లారిటీ ఇచ్చిన ఆమె.. “ఒకవేళ ఆ మహిళ నేనే అయినా.. నా దుస్తుల గురించి మీకెందుకు?” అంటూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. వైరల్ అవుతున్న వీడియోలో ఓ కారులో నుంచి దిగుతున్న మహిళను కీర్తనగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, మహిళల దుస్తులు, రూపం, వ్యక్తిగత ఎంపికలను రాజకీయ చర్చగా మార్చడం వెనుక ఉన్న ఆలోచనా ధోరణిపై మండిపడ్డారు. ‘మా విధానాలను, మా పాలనను, మా పనితీరును ప్రశ్నించలేకపోతే.. వ్యక్తిగత జీవితాలపై కథలు అల్లుతారా?’ అంటూ కీర్తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. మహిళలను వారి పని, సామర్థ్యం కంటే దుస్తులు, రూపంతో కొలవడం వెనుక తిరోగమన భావజాలం ఉందని విమర్శించారు.
Fake News About Minister Keerthana ❌🗣️#tvk #tvkfortn #tvkvijay #ministerissue pic.twitter.com/69AzolwJMA
— 𝕋𝕍𝕂 𝕀𝕋 𝕎𝕀ℕ𝔾 (@TVKITWINGG) August 23, 2026
ఇక్కడితో ఆగకుండా.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ కీర్తన చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరింత హీట్ పెంచాయి. మహిళలపై గతంలో అవమానకర వ్యాఖ్యలు చేసిన నాయకుడి అనుచరుల నుంచి ఇలాంటి ప్రచారాలు రావడంలో ఆశ్చర్యం లేదంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. వైరల్ వీడియోలోని మహిళను కూడా కీర్తన ప్రస్తావించారు. తనతో పోలిక ఉండటంతో అనవసరంగా వివాదంలోకి లాగినందుకు ఆమెకు క్షమాపణలు చెప్పారు. “నీలా నువ్వు జీవించు.. నీకు నచ్చినట్లుగా ఉండటం ఆపొద్దు” అంటూ ఆమెకు మంత్రి మద్దతు తెలిపారు.
చదవండి: బీహార్‌లో పొలిటికల్ ట్విస్ట్.. సీఎం రేసులోకి నితీష్ వారసుడు?
ఇదిలా ఉండగా.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో శివకాశి నుంచి గెలిచిన కీర్తన.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియా వైరల్ వీడియోకే పరిమితం కాకుండా టీవీకే వర్సెస్ ప్రత్యర్థి పార్టీల మధ్య మరో రాజకీయ మాటల యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. వీడియో ఎవరిదన్న దానికంటే.. మహిళల వ్యక్తిగత జీవితాలనే రాజకీయ ఆయుధంగా ఎందుకు మారుస్తున్నారన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీర్తన లేవనెత్తిన అసలు ప్రశ్న.
இது நானா..? எனக்கே ஆச்சரியமா இருக்கு...! இணையதளத்தில் வைரலாகும் பெண்ணின் வீடியோ.... அமைச்சர் கீர்த்தனா விளக்கம்#Sivakasi | #MinisterKeerthana | #ViralVideo | #PolimerNews pic.twitter.com/oyhQVaXyEZ
— Polimer News (@polimernews) August 24, 2026


