జియో రీచార్జ్‌ ప్లాన్‌: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్‌! | Jio ₹999 Recharge Plan, 98 Days Validity, 196GB Data, Unlimited 5G, JioHotstar And Google AI Pro Benefits Explained | Sakshi
Sakshi News home page

జియో రీచార్జ్‌ ప్లాన్‌: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్‌!

Aug 22 2026 5:38 PM | Updated on Aug 22 2026 5:50 PM

Jio Prepaid Plan 98 days validity benefits

మొబైల్‌ రీఛార్జ్‌ విషయంలో ఎక్కువ వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, అపరిమిత 5జీ, కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏఐ సేవలు అందించే ప్లాన్లకు ప్రస్తుతం వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ జియో అందిస్తున్న రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ పలు ప్రయోజనాలతో ఆకట్టుకుంటోంది. ఒక్కసారి రీఛార్జ్‌ చేసుకుంటే 98 రోజుల పాటు సేవలు పొందొచ్చు.

98 రోజుల వ్యాలిడిటీ.. 196 జీబీ డేటా

రూ.999 ప్లాన్‌లో 98 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. అంటే మొత్తం వ్యాలిడిటీ కాలంలో 196 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తారు. తరచూ రీఛార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దాదాపు మూడు నెలల పాటు ఈ సేవలను పొందవచ్చు.

5జీ యూజర్లకు అపరిమిత డేటా

5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు జియో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్‌తో అపరిమిత 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది. 5జీ సేవలు అందుబాటులో లేకపోతే రోజువారీ 2 జీబీ హైస్పీడ్‌ డేటా వినియోగం పూర్తయ్యాక ఇంటర్నెట్‌ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

జియోహాట్‌స్టార్‌, గూగుల్‌ ఏఐ ప్రో

ఈ ప్లాన్‌లో వినోదం కోసం జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా గూగుల్‌ ఏఐ ప్రో ప్రయోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో 5,000 జీబీ గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌, జెమిని ప్రో యాక్సెస్‌తో పాటు నానో బనానా సహా పలు ఏఐ ఫీచర్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జియో క్లౌడ్‌ ద్వారా అదనంగా 50 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ ప్రయోజనం కూడా లభిస్తుంది.

సబ్‌స్క్రిప్షన్‌ కొనసాగాలంటే ఇదే కీలకం

అయితే జియోహాట్‌స్టార్‌, గూగుల్‌ ఏఐ ప్రో ప్రీమియం ప్రయోజనాలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈ ప్రయోజనాలను యాక్టివ్‌గా కొనసాగించేందుకు తదుపరి నెలల్లో కనీసం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన జియో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌, 5జీ డేటాతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏఐ సేవలను ఒకే ప్లాన్‌లో కోరుకునే వారికి రూ.999 రీఛార్జ్‌ ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement