మూడేళ్ల క్రితం 'హనుమాన్' సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి.. అద్భుతమైన సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం రిషభ్ శెట్టితో 'జై హనుమాన్' తీస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది థియేటర్లలోకి రావొచ్చు. అయితే తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇప్పుడు 'మహాకాళి' మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. శుక్రాచార్యుడికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'ఇరుముడి'కి పట్టం కట్టిన ప్రేక్షకులు.. తొలి వీకెండ్ ఎన్ని కోట్లు వచ్చాయ్?)
'మహాకాళి' పేరుతో తీస్తున్న ఈ సినిమాలో భూమిశెట్టి ప్రధాన పాత్ర చేస్తుండగా.. శుక్రాచార్యుడి అనే విలన్ పాత్రని 'ధురంధర్' ఫేమ్ అక్షయ్ ఖన్నా పోషిస్తున్నాడు. శుక్రాచార్యుడి కన్నీరు పేరిట విడుదల చేసిన దాదాపు మూడు నిమిషాల వీడియోతో మూవీ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, డైలాగ్స్ కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఆహార్యం కొత్తగా ఉండగా.. చివరలో మహాకాళిని చూపించడం అదిరిపోయింది.

అయితే ఇప్పటివరకు PVCU అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనుకున్నారు. కానీ ఈ టీజర్‌లో PVCU అంటే 'పురాణ వీర చిత్ర ఉదయం' అని రాసుకొచ్చారు. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు పర్యవేక్షణ ప్రశాంత్ వర్మ చేయగా పూజా కొల్లూరు దర్శకత్వం వహించింది. వచ్చే సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని దింపారు. జనవరి 8న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
సంక్రాంతి బరిలో ఇప్పటికే చిరంజీవి 'కాకా', వెంకటేశ్-కల్యాణ్ రామ్-అనిల్ రావిపూడి 'జనవరి 12 విడుదల', సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు', శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమాలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 'మహాకాళి' కూడా లిస్టులోకి చేరింది. రిలీజ్ టైంకి వీటిలో ఏవి నిలుస్తాయో? ఏవి తప్పుకొంటాయో చూడాలి?
(ఇదీ చదవండి: దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్)


