సంక్రాంతి బరిలో మెగా హీరో.. ఎట్టకేలకు ప్రకటన | Sambarala Yeti Gattu Movie Release Date | Sakshi
Sakshi News home page

Sambarala Yeti Gattu: రెండేళ్ల క్రితం మొదలైన సినిమాకు మోక్షం

Aug 15 2026 5:55 PM | Updated on Aug 15 2026 6:30 PM

Sambarala Yeti Gattu Movie Release Date

మెగా హీరోలు చిరంజీవి, పవన్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ చాన్నాళ్ల తర్వాత రీసెంట్ టైంలో హిట్స్ కొట్టారు. మిగిలిన వాళ్లలో సాయితేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు సక్సెస్ అందుకోవాల్సి ఉంది. వీళ్లలో వైష్ణవ్ పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేయగా సాయితేజ్ మాత్రం గత రెండేళ్లుగా 'సంబరాల ఏటిగట్టు' మూవీ చేస్తున్నాడు. ఇదొకటి ఉందనే సంగతే జనాలు మర్చిపోయారు. అంతలా ఆలస్యమవుతూ వస్తోంది. అలాంటిది ఇప్పుడు స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా దీని రిలీజ్ డేట్ ప్రకటించారు.

(ఇదీ చదవండి: గాంధీజీ హైదరాబాద్‌కి వస్తే.. 'ఫౌజీ' క్రేజీ కొత్త పోస్టర్)

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న 'సంబరాల ఏటిగట్టు' థియేటర్లలో రిలీజ్ కానుందని పోస్టర్ వదిలారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో వెంకటేశ్-అనిల్ రావిపూడి, శర్వానంద్ 'జార్జ్ క్రిష్' చిత్రాలు రానున్నాయని అధికారికంగా వెల్లడించారు. చిరంజీవి-బాబీ ప్రాజెక్ట్ కూడా సంక్రాంతికే వచ్చే అవకాశముంది. మరి మామయ్య చిరు మూవీ ఒకవేళ వస్తే.. సాయిధరమ్ తేజ్ ఏమైనా తప్పుకొంటాడా? లేదంటే కలిసి పోటీపడతాడా అనేది చూడాలి?

రెండేళ్లుగా సెట్స్‌పైనే ఉన్న ఈ సినిమాకు రోహిత్ కేపీ అనే కుర్రాడు దర్శకుడు. ఇదే ఇతడికి తొలి సినిమా. 'హనుమాన్' నిర్మించిన నిరంజన్ రెడ్డి నిర్మాత. గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ బట్టి చూస్తే ఇదో పీరియాడిక్ యాక్షన్ డ్రామా. పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. అయితే సాయిధరమ్ తేజ్‌కి తెలుగులోనే ఓ మాదిరి మార్కెట్ ఉంది. మరి పాన్ ఇండియాలో ఈ మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: 20 ఏళ్ల వయసు గ్యాప్.. ఆమెని దూరం పెట్టాలని ట్రై చేశా కానీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement