భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భారత సైనికులతో కలిసి సందడి చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన సైనికులతో ముచ్చటించారు.
‘ప్రపంచవ్యాపంగా జరుగుతున్న యుద్ధాల కోసం నా పిల్లలు తైమూర్, జెహ్ తరుచూ నన్ను అడుగుతుంటారు. ఆ యుద్ధాలను చూసి పిల్లలు భయపడుతుంటారు. మమ్మల్ని ఎవరు కాపాడతారు? పరిస్థితులు మరింత దిగజారుతాయా? అని అడుగుతుంటారు. అప్పుడు నేను భారత సైన్యం మనల్ని రక్షిస్తోందని చెబుతుంటాను’ అని సైఫ్ తెలిపారు.
కాశ్మీర్ దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటన్నారు. తన తల్లి, ప్రముఖ నటి షర్మిలా ఠాగుర్ నటించిన తొలి చిత్రం ‘కశ్మీర్ కీ కలి’ తో పాటు అనేక చిత్రాల పాటలు కశ్మీర్‌లోనే చిత్రీకరణ జరిగిందని తెలిపారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సైఫ్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైవాన్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తరువాత అక్షయ్‌కుమార్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రం సెప్టెబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


