'ఇన్‌ ఫ్రంట్‌ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్'.. శంకర్‌దాదా ట్రైలర్ చూశారా? | Chiranjeevi and Sonali Bendre Shankar Dada MBBS Re Release Trailer | Sakshi
Sakshi News home page

Shankar Dada MBBS: 'అరె అన్న ఇంగ్లీష్‌ మాట్లాడిండు'.. శంకర్‌దాదా ట్రైలర్ చూశారా?

Aug 15 2026 4:10 PM | Updated on Aug 15 2026 4:13 PM

Chiranjeevi and Sonali Bendre Shankar Dada MBBS Re Release Trailer

మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రాల్లో శంకర్‌దాదా ఎంబీబీఎస్ ఒకటి. ఈ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. లింగం మామయ్యా అంటూ చిరు చేసిన కామెడీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. చిరు పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నెల 22న చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్‌దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు.  2004లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మరోసారి ఫ్యాన్స్‌ను అలరించేందుకు వస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే హీరోయిన్‌గా మెప్పించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు మాధవ్ కీలక పాత్రల్లో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement