అప్పట్లో హీరోయిన్‌గా తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన సమంత.. మధ్యలో అనారోగ్యం కారణంగా సినిమాలు తగ్గించింది. చేసినవి కూడా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంత.. నిర్మాతగా మారి 'శుభం' తీసింది. రెండు నెలల క్రితం వచ్చిన 'మా ఇంటి బంగారం'తో హీరోయిన్ కమ్ నిర్మాతగా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. రూ.100 కోట్ల కలెక్షన్స్ ఈ మూవీ సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)
'బంగారం' హిట్ అయ్యేసరికి వరస సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. దీంతో రాబోయే కొన్ని నెలల పాటు సామ్ ఇంటికే పరిమితం కానుంది. అలాంటిది ఉన్నట్టుండి ఈమె ఓ వంటల ప్రోగ్రామ్‌కి హోస్టింగ్ చేయబోతుందని ప్రకటించారు. ప్రోమో వీడియో కూడా రిలీజ్ చేశారు.
గతంలో తెలుగులో హీరోయిన్‌గా వరస సినిమాలు చేస్తున్న టైంలోనే 'సామ్ జామ్' పేరుతో ఓ టాక్ షోకి హోస్టింగ్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వనుంది. తమిళంలో సోనీ సంస్థ ఛానెల్ ప్రారంభించింది. ఇందులో రెండు నెలల తర్వాత సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. దీనికి సమంత హోస్టింగ్ చేయనుంది. ప్రోమో చూస్తుంటే షూటింగ్ ఎప్పుడు జరిగిందా? అనిపిస్తుంది. ఎందుకంటే సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. బేబీ బంప్‌తో హోస్టింగ్ ఏమైనా చేస్తుందా అనేది చూాడాలి?.
(ఇదీ చదవండి: విశాల్ సినిమాకు దారుణ పరిస్థితి.. రూ.కోటి కూడా రాలేదు!)
The ultimate culinary face-off begins here, with @Samanthaprabhu2 leading the way.
Celebrity MasterChef Tamil - Coming soon on Sony விழா and Sony LIV.#CelebrityMasterChefTamil #CMCTamil #Samantha #SonyVizha #SonyLIVTamil pic.twitter.com/sxHubOJ1dp— Sony Vizha (@sony_vizha) August 15, 2026


