కన్నడ నటుడు భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ చిత్రంలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, కన్నడ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మేరకు పూజా కార్యక్రమాల్ని శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బండి నాగరాజు నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుంది. జైభార్గవ్, మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్, కాదంబరి కిరణ్, కిల్లి క్రాంతి, అనంత ప్రభు, టేస్టీ తేజ, సాయి కిషోర్, నితిన్, తదితరులు నటించనున్నారు.
హీరో, డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాటలో ఎంత వైబ్ ఉందో ఈ సినిమాలోనూ అలాంటి ఫీల్ ఉంటుంది. ఈ చిత్రంతో తెలుగులో సినీ ప్రయాణం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది. సినిమా అంటే వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. నాగరాజు సినిమా పట్ల ప్యాషన్ ఉన్న నిర్మాత. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. రోహిత్ సూపర్ హిట్ సాంగ్స్ అందించారు’ అని అన్నారు.


