ఈ హీరోలు గుర్తున్నారా? ఇంతకీ ఏమయ్యారు? | Vaishnav Tej And Karthikeya No Movies Whats Reason | Sakshi
Sakshi News home page

సినిమాలు చేయడం మానేశారా? ఈ హీరోలు ఇప్పుడెక్కడ?

Aug 14 2026 2:53 PM | Updated on Aug 14 2026 3:06 PM

Vaishnav Tej And Karthikeya No Movies Whats Reason

ఇండస్ట్రీలో సరైన అవకాశాలు కోసం వేలమంది కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. మరికొందరు మాత్రం వచ్చిన ఛాన్సులని సరిగా నిలుపుకోలేక ఇబ్బందిపడుతుంటారు. ఇండస్ట్రీ అంటేనే అలాంటిది మరి. హీరోహీరోయిన్ల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. అసలు విషయానికొస్తే.. హిట్స్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు వైష్ణవి తేజ్, కార్తికేయ గత కొన్నేళ్ల నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ వీళ్లు ఏమయ్యారు? అసలేం చేస్తున్నారు?

(ఇదీ చదవండి: బాసూ.. ఆ సినిమాని మర్చిపోయారా?)

మొదటగా వైష్ణవ్ తేజ్ విషయానికొద్దాం. 'మెగా' హీరో అనే ట్యాగ్ వల్ల పెద్దగా కష్టం లేకుండానే హీరో అయిపోయాడు. తొలి సినిమా 'ఉప్పెన'తో సక్సెస్ అందుకోవడమే కాకుండా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి అప్పట్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాడు. కానీ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ అని మూడు చిత్రాలు చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.

2023లో 'ఆదికేశవ'తో చివరగా కనిపించిన వైష్ణవ్ తేజ్.. తర్వాత మరో సినిమా చేయలేదు. మధ్యలో మారుతి అని మరో దర్శకుడు అని పలువురు పేర్లు వినిపించాయి కానీ ఏది ఖరారైతే కాలేదు. మధ్యలో ఓ హీరోయిన్‌తో ప్రేమ, డేటింగ్ రూమర్స్ వచ్చాయి కానీ వీటిలో ఎంత నిజముందో తెలీదు. యాక్టింగ్ కాకుండా వేరే ఏమైనా చేస్తున్నాడనేది కూడా తెలీదు. వైష్ణవ్ సోదరుడు సాయిధరమ్ తేజ్ అయితే ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు' అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా అప్పుడెప్పుడో మొదలైంది. షూటింగ్ అలా నడుస్తూనే ఉంది. ఎప్పుడొస్తుందనే అప్‌డేట్ లేదు.

వైష్ణవ్ లానే కెరీర్ ప్రారంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో హీరో కార్తికేయ. 2017లో 'ప్రేమతో మీ కార్తిక్' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. 2018లో రిలీజైన 'ఆర్ఎక్స్ 100' ఇతడి జీవితాన్ని మార్చేసింది. హిట్ అవ్వడంతో పాటు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ఊపులో హీరో కమ్ విలన్‌గా గ్యాంగ్ లీడర్, వలిమై, బెదురులంక 2012, చావు కబురు చల్లగా, 90ఎమ్ఎల్ తదితర చిత్రాలు చేశాడు. ఫలితాలతో సంబంధం లేకుండా నటుడిగా పేరు సంపాదించాడు.

2024లో 'భజే వాయువేగం'తో సక్సెస్ అందుకున్న కార్తికేయ.. తర్వాత నుంచి పూర్తిగా కనిపించడం మానేశాడు. బిజినెస్‌లోకి ఎంటరయ్యాడని అందుకే యాక్టింగ్ పెట్టేశాడని కొందరు అంటుండగా.. లేదు లేదు స్వయంగా దర్శకుడిగా మారి కొత్త ప్రాజెక్టుతో త్వరలో రాబోతున్నాడని మరికొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం హిట్ కొట్టిన ఇద్దరు యంగ్ హీరోలు ఇలా సినిమాలు చేయకుండా ఉండిపోవడం కాస్త విచిత్రంగానే ఉంది. మరి ఇండస్ట్రీకి దూరమైపోయారా? లేదంటే ‍త్వరలో రీఎంట్రీ ఇస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. ఫోన్‌లో ఫొటోలు తీసుకోను: నాగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement