ఏడేళ్ల తరువాత డీపీ మార్చిన ప్రభాస్‌.. కారణం ఇదేనా | Prabhas Changes Instagram DP After 7 Years: Replaces Baahubali with Fauzi Still | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తరువాత డీపీ మార్చిన ప్రభాస్‌.. కారణం ఇదేనా

Aug 14 2026 12:49 PM | Updated on Aug 14 2026 1:02 PM

After 7 Years Prabhas Replaces Baahubali DP With Fauzi Still

స్టార్‌ హీరోలు ఏ చిన్న పనిచేసినా వైరల్‌గా మారుతుంటారు. ఈ తరహాలోనే రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చేసిన ఓ చిన్న మార్పు కూడా సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ మొదలుపెట్టిన ఏడు సంవత్సరాల తరువాత తన ప్రొఫైల్‌ ఫొటోను ప్రభాస్‌ మార్చడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇన్నాళ్లూ ‘ బాహుబలి’ చిత్రంలోని ఫొటోనే డీపీగా ఉంచాడు. ఇప్పుడు ఫౌజీ చిత్రంలోని కొత్త స్టిల్‌ను ప్రొఫైల్‌గా మార్చారు. 'బాహుబలి' తర్వాత సలార్‌, కల్కీ వంటి భారీ చిత్రాలు ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ ప్రభాస్‌ తన డీపీని మార్చలేదు. ఇప్పుడు  'ఫౌజీ' చిత్రంలోని స్టిల్‌ను పెట్టడంపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే దీనికి కారణమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ఇప్పటికే విడుదలైన తేదీ పోస్టర్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ప్రభాస్‌ చేసిన ఈ మార్పు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement