ఓటర్‌ ఐడీ తొలగింపుపై ప్రకాశ్‌రాజ్‌ స్పందన ఇదే..! | Prakash Raj Reacts to Voter ID Issue: Questions Authorities Over Dignity of Citizens | Sakshi
Sakshi News home page

ఓటర్‌ ఐడీ తొలగింపుపై ప్రకాశ్‌రాజ్‌ స్పందన ఇదే..!

Aug 13 2026 1:37 PM | Updated on Aug 13 2026 1:42 PM

Prakash Raj Speak Voter Id

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ మరోసారి ఓటరు జాబితా అంశంపై స్పందించారు. కొత్త ఓటరు గుర్తింపు కార్డు కోసం తాను ఫారమ్‌-6 దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని తాను సోషల్‌మీడియాలో ప్రస్తావించిన కొద్ది గంటల్లోనే అది లక్షలాది మందికి చేరిందని పేర్కొన్నారు.

‘నేను నా వృత్తి కారణంగా సెలబ్రిటీని కావొచ్చు. కానీ ముందుగా ఓ పౌరుడిని. ప్రతి పౌరుడితో నాకు సమాన హక్కులు ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి గురించి కాదు.. పౌరుల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం’ అని ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు.
ఓటు హక్కు కోసం ప్రజలు క్యూల్లో నిలబడి వేడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన ఆయన.. ‘ ఇదేం  రాజకీయం? ఇదేం ఎజెండా?’ అంటూ అధికారులను నిలదీశారు.

అధికారులు తనకు ఫోన్‌ చేసి పొరపాటు జరిగిందని, దానిని సరిదిద్దుతామని చెప్పారని తెలిపారు. దీనికి సంబంధించిన కాల్‌ రికార్డులు కూడా తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. అధికారులు మీడియా సమావేశం నిర్వహించి, వెబ్‌సైట్‌లోని వివరాలను మార్చారని ఆరోపించారు. అనంతరం తన పాత చిరునామా వద్దకు బీఎల్‌వోను పంపించి, పొరుగువారితో మాట్లాడిస్తూ నాటకీయ పరిణామాలను సృష్టించారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement