బాలీవుడ్ నటుడు, ఎంపీ రవికిషన్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. ఆయన చెప్పిన మాటలు, డ్యాన్స్ స్టెప్పులు యువతకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జెన్‌జీలు ఆయన వీడియోలను వైరల్ చేస్తున్నారు.
తాజాగా రవికిషన్ యువతపై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జనరేషన్ జెడ్ సృజనాత్మకతకు సెల్యూట్ చేస్తున్నాను. మీరు చేస్తున్న సృజనాత్మక పనులు అద్భుతంగా ఉన్నాయి. నా మాటలు, నా పేరును మీ శైలిలో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒకప్పుడు గుర్తింపు లేకుండా ఉన్న నన్ను మళ్లీ ప్రజల్లోకి తీసుకొచ్చింది మీరే. జెన్‌జీలకు నా నమస్కారాలు’’ అంటూ యువతకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా యువతను పార్లమెంట్‌కు ఆహ్వానించారు. ‘దేశంలోనే అతిపెద్దది పంచాయతీ పార్లమెంట్. ఇక్కడికి మీ అందరికీ స్వాగతం. భారత భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దేశ జనాభాలో 65 శాతం మంది యువతే ఉన్నారు’ అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువత అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని రవికిషన్ చెప్పారు. దేశ అత్యున్నత వేదికలో యువత మాటలకు ప్రాధాన్యం పెరుగుతోందని వివరించారు. సినిమాల విషయానికి వస్తే.. రవికిషన్ ప్రస్తుతం ‘మిర్జాపూర్: ది మూవీ’, ‘ఖోస్లా కా ఘోస్లా 2’, ‘నాగ్‌జిల్లా’ చిత్రాల్లో నటిస్తున్నారు.


