మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని అమ్మనాన్న ఏడ్చారు | Bigg Boss Telugu Agnipariksha Latest Promo: Singer Jhansi Emotional Speech & Final 15 List | Sakshi
Sakshi News home page

Bigg Boss Agnipariksha: బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష.. ఎంపికైన 15 మంది వీళ్లే!

Aug 14 2026 1:01 PM | Updated on Aug 14 2026 1:06 PM

Bigg Boss Telugu Agnipariskha Latest Promo

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ రేపటి(ఆగస్టు 14) నుంచి ప్రసారం కానుంది. ఈ పోటీలో 70 మంది సామాన్యులు పాల్గొనగా 15 మంది తుది పోటీ కోసం ఎంపికయ్యారు. వీళ్లలో మిగతా అందరికంటే సూర్యాపేట్‌కి చెందిన రైతు, సింగర్ ఝాన్సీని ప్రోమోల్లో ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన విషయాలని ఎమోషనల్‌గా చూపిస్తున్నారు. మరి ఈమె ఏం చెప్పింది? ఫైనల్-15కి సెలెక్ట్ అయిందా? లిస్టులో ఎవరెవరున్నారంటే?

(ఇదీ చదవండి: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. ఫోన్‌లో ఫొటోలు తీసుకోను: నాగ్)

ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కష్టాలు ఏముంటాయి? అని జ‍డ్జి నవదీప్ ఈమెని అడగ్గా.. 'పెట్టుబడి పెట్టందే పంట పండదు. చివరకొచ్చేసరికి ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాదు. కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేం. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రకృతితోనే పోటీపడాలి. నేను పుట్టినప్పుడు మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని మా అమ్మవాళ్లు ఏడ్చారు. ఈ రోజు నువ్వు కన్నది ఆడపిల్లని కాదు నలుగురికి స్పూర్తిగా ఉండే ఓ మగరాయుడు లాంటి బిడ్డని కన్నావ్ అని అంటున్నారు' అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.

ఇకపోతే అగ్నిపరీక్ష తుదిపోటీలకు ఎంపికైన వారిలో రాజ కుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగి తుల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీళ్లలో నుంచి బిగ్ బాస్ 10వ సీజన్‌లోకి ఎవరు అడుగుపెడతారానేది షో మొదలయ్యే రెండు మూడు రోజుల ముందు తెలిసే అవకాశముంది.

వచ్చే నెలలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ కొత్త సీజన్ కోసం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలని టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆటో రాంప్రసాద్ దాదాపు ఖరారు కాగా యాదమ్మ రాజు, దీపిక రంగరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, ఆషిక, నూకరాజు, పల్లవి గౌడ లేదా పల్లవి రామిశెట్టి లాంటి టీవీ సెలబ్రిటీలు ఈసారి షోలోకి రానున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement