ప్రెగ్నెన్సీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన 'బిగ్‌బాస్' శుభశ్రీ | Bigg Boss Telugu Fame Subhashree Reacts Pregnancy Rumours | Sakshi
Sakshi News home page

Bigg Boss Subhashree: తెగ కామెంట్స్.. దీంతో వీడియో పోస్ట్ చేసి మరీ

Jul 21 2026 10:23 AM | Updated on Jul 21 2026 10:32 AM

Bigg Boss Telugu Fame Subhashree Reacts Pregnancy Rumours

తెలుగు బిగ్‌బాస్ 7వ సీజన్‌లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో శుభశ్రీ రాయగురు ఒకరు. స్వతహాగా ఒడియా అమ్మాయి, లాయర్ అయినప్పటికీ తెలుగు సినిమాల్లో నటిగా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ఒకటి రెండు మూవీస్‌లోనూ కనిపించింది. కానీ సక్సెస్ ఏం రాలేదు. ఇదే టైంలో ఆస్ట్రేలియాలో ఉంటున్న అజయ్ అనే భారతీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

గతేడాది జూన్‌లో తన పెళ్లి సంగతి బయటపెట్టింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత గత వారం పదిరోజుల నుంచి అడపాదడపా పోస్టులు పెడుతోంది. అయితే గతంతో పోలిస్తే ఈమె కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో శుభశ్రీ ప్రెగ్నెన్సీతో ఉందా అని పలువురు ఫాలోవర్లు కామెంట్స్ చేశారు. దీంతో శుభశ్రీ ఏకంగా ఓ వీడియో పోస్ట్ చేసింది. 'మీరు ప్రెగ్నెంటా' అని పదేపదే కామెంట్ పెడుతున్న సదరు నెటిజన్‌కి కౌంటర్ ఇచ్చింది. అదే టైంలో తానేం ప్రెగ్నెన్సీతో లేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: 'జన నాయగన్' 50 శాతమే రీమేక్.. వేరే కథ విజయ్‌కి చెబితే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement