తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. అయితే ఇది తెలుగు మూవీ 'భగవంత్ కేసరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా సాగుతోంది. ఇది అదే అని అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఏది బయటకు రాలేదు. కానీ ఇప్పుడు స్వయంగా దర్శకుడు హెచ్. వినోత్ రీమేక్ వార్తలపై స్పష్టత ఇచ్చేశాడు. సగం మాత్రమే రీమేక్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు)
''జన నాయగన్'..భగవంత్ కేసరికి రీమేక్. కాకపోతే పూర్తిగా చేయలేదు. 'భగవంత్ కేసరి'లో 50% మాత్రమే ఉంటుంది. ఫస్టాఫ్‌లో 60%, సెకండాఫ్‌లో 20% ఉంటుంది. విజయ్ సార్ చివరి మూవీ కోసం నేను మొదట వేరే కథ వినిపించా. కానీ ఆ కథ చాలా హెవీగా ఉందన్నారు. 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేయమని నన్ను అడిగారు. బాలయ్య యూనివర్స్ విజయ్ శైలికి భిన్నంగా ఉంటుంది. 'నేర్కొండ పార్వై' తర్వాత మళ్లీ రీమేక్ చేయాలా అనే సందేహాలు నాకు చాలానే ఉండేవి. ఇది విజయ్ చివరి సినిమా కాబట్టి, ఛాన్స్ వదులుకోవాలని అనుకోలేదు'
'అయితే మనం ఎందుకు రీమేక్ సినిమా చేయాలని నేను విజయ్‌ని అడిగాను. 'భగవంత్ కేసరి' ఎందుకు నచ్చిందో ఆయన నాకు సీన్ బై సీన్ వివరించారు. విజయ్‌కి మహిళా సాధికారత పట్ల ఆసక్తి ఉంది. ఇది విజయ్ సర్ చివరి సినిమా అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే భవిష్యత్తులో సీఎం విజయ్ సర్‌గా మారిన తర్వాత వచ్చే తొలి సినిమాగా మాత్రం దీన్ని చూడొచ్చు. ఇది కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. విజయ్‌ని హీరోయిక్‌గా చూపించడానికే తీసిన సినిమా కాదు. సున్నితమైన రాజకీయాల నేపథ్యంలో సాగే కథ ఇది'
'జన నాయగన్' విషయంలో నేను రెండుసార్లు ఏడ్చాను. సెన్సార్ ఆలస్యమై పొంగల్ పండగకు సినిమా విడుదల కానప్పుడు, సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయినప్పుడు, పైరసీని ఎవరూ ఆపలేకపోయినప్పుడు బాధపడ్డాను. అప్పుడు విజయ్ సార్ నాకు అండగా నిలిచారు. 'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బాధపడకండి. ఒకవేళ మనసు బాగోలేకపోతే నాకు ఫోన్ చేయండి' అని నాకు ధైర్యం చెప్పారు' అని డైరెక్టర్ వినోత్ అన్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. అనిరుధ్ సంగీతమందించాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
Dir #HVinoth Recent
- #JanaNayagan is not a complete remake of #BhagavanthKesari. Around 50% is inspired by BK, while the remaining 50% is an entirely new story.
- The core idea has been reworked, with the hero villain conflict significantly expanded and made much bigger than in…— Movie Tamil (@_MovieTamil) July 20, 2026


