మరోవారం వచ్చేసింది. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. తెలుగులో అయితే కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీనితో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.
(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే లేవు. ఉన్నంతలో పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు కాస్తోకూస్తో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఇంకేమైనా సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్ లాంటివి ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 20 నుంచి 26 వరకు)
నెట్‌ఫ్లిక్స్
ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 22
ఎలైట్ ఫోర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 22
రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23
ద డెట్ కలెక్టర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 23
ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 24
72 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24
లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24
ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24
కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24 (రూమర్ డేట్)
హాట్‌స్టార్
స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24
బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25
అమెజాన్ ప్రైమ్
ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24
జీ5
అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24
ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24
సోనీ లివ్
పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24
లయన్స్ గేట్ ప్లే
ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24
ఆపిల్ ప్లస్ టీవీ
ద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24
సన్ నెక్స్ట్
- సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్)


