ట్రైలర్‌ చూస్తుంటే సినిమా హిట్‌ అనిపిస్తోంది: నిర్మాత అల్లు అరవింద్‌ | Producer Allu Aravind Speech at Chennai Love Story Trailer Launch Event | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ చూస్తుంటే సినిమా హిట్‌ అనిపిస్తోంది: నిర్మాత అల్లు అరవింద్‌

Jul 20 2026 3:28 AM | Updated on Jul 20 2026 3:28 AM

Producer Allu Aravind Speech at Chennai Love Story Trailer Launch Event

వై. రవిశంకర్, అల్లు అరవింద్, కిరణ్, గౌరీ ప్రియ

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన అనంతరం నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ ట్రైలర్‌లోని భావోద్వేగాలను గమనిస్తే ఇది కచ్చితంగా హిట్‌ అయ్యే సినిమా అనే భావన కలుగుతోంది.

కిరణ్‌ ఎంతో సహజంగా నటిస్తారు. మైత్రీ రవిగారు ఈ సినిమాకు చాలా సపోర్ట్‌ చేశారు. ఈ నెల 24న ‘చెన్నై లవ్‌స్టోరీ’ టీమ్‌ అందరికీ మంచి విజయం లభించబోతోంది’’ అన్నారు. ‘‘నానీని నేచురల్‌ స్టార్‌ అని పిలుస్తాం. అలాగే కిరణ్‌ను ఒరిజినల్‌ స్టార్‌ అని పిలవాలని ఉంది. మా బ్యానర్‌లో నెక్ట్స్‌ కిరణ్‌ చేయబోయే సినిమాలో ఒరిజినల్‌ స్టార్‌ అని వేస్తాం’’ అన్నారు వై. రవిశంకర్‌. ఈ కార్యక్రమంలో రవి నంబూరి, ఎస్‌కేఎన్, సాయి రాజేష్, సహ–నిర్మాత ధీరజ్‌ మొగిలినేని తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement