జానీ మాస్టర్‌కి ఉపశమనం | Dancer Association Issue And Jani Master Latest News | Sakshi
Sakshi News home page

Jani Master: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి తెర

Jul 19 2026 9:18 PM | Updated on Jul 19 2026 9:18 PM

Dancer Association Issue And Jani Master Latest News

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి ఉపశమనం లభించింది. ఈయనపై విధించిన బహిష్కరణను ఉపసంహరించుకున్నట్లు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆదివారం ప్రకటించింది. జానీ మాస్టర్‌తో పాటు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చెప్పారు.

(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)

ఫెడరేషన్ కార్యాలయంలో నిర్మాతల మండలి నుంచి చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్, దర్శకుల సంఘం నుంచి సాయి రాజేష్‌తో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించిన ఫిలిం ఫెడరేషన్.. డాన్సర్ల వేతనాల చెల్లింపు వివాదంలో జానీ మాస్టర్, సుమలతా దేవితో సుదీర్ఘంగా చర్చించారు. ఇరువైపులా సమస్యకు ముగింపు పలికేలా నిర్ణయం తీసుకున్నారు.

డాన్సర్స్ అసోసియేషన్ రాజీనామా చేసినా.. ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్‌తో కలిసి ముందుకు వెళ్లాలని ఫెడరేషన్ సుమలత దేవికి సూచించింది. డాన్సర్ల కష్టం దుర్వినియోగం కాకూడదన్న తమ పోరాటానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి జానీ మాస్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

(ఇదీ చదవండి: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement