పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్‌లో నటించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ మూవీని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పుష్ప తరహాలో రెండు భాగాలు తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తన్నట్లు అనిపిస్తోంది.
ఈ చిత్రంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన మార్క్ చూపించనున్నట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు కోరుకునే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్మామెన్స్‌కు స్కోప్ ఉంటుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ మూవీ 2027 చివర్లో లేదా.. 2028 మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.


