సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి? | Salman Khan Weight Loss Look Sparks Health Concerns Among Fans On Social Media, New Look Video Trending | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?

Jul 19 2026 3:26 PM | Updated on Jul 19 2026 3:53 PM

Salman Khan looks Unrecognizable, Latest Video Goes Viral

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా లుక్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ముంబైలో ఓ ఐటీ సర్వర్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలే ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ డియోలో సల్మాన్ ఖాన్ మునుపటి కంటే చాలా బరువు తగ్గి, కాస్త సన్నగా కనిపించారు.

ఆయన కళ్లలో తీవ్రమైన అలసట కనిపించడం, ముఖంలో గ్లో తగ్గడం, నడిచేటప్పుడు కూడా కాస్త నీరసంగా ఉండటంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ‘కండల వీరుడు ఇలా అయిపోయాడేంటి?’, ‘ఆయనకు ఏమైనా అనారోగ్య సమస్య ఉందా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మరికొందరు మాత్రం సినిమా కొత్త సినిమా కోసం ఇలా మేకోవర్‌ అయ్యాడేమో అని కామెంట్స్‌ పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement