ఫౌజీ @ 40 | Prabhas Fauji 40 Percentage shoot completed | Sakshi
Sakshi News home page

ఫౌజీ @ 40

Jul 21 2026 12:26 AM | Updated on Jul 21 2026 5:51 AM

Prabhas Fauji 40 Percentage shoot completed

‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌ అనుకున్నట్లుగానే సజావుగా సాగుతోందని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెలిపారు. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్‌’. ఈ సినిమాలో  త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్, కాంచన, వివేక్‌ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం తొలిసారి ΄పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ప్రభాస్‌. భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.

అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ–‘‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. మిగతా షూటింగ్‌ను కూడా ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే...  ప్రస్తుతం వెకేషన్ లో భాగంగా విదేశాల్లో ఉన్నారు ప్రభాస్‌. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ‘ఫౌజీ’  చిత్రీకరణలో పాల్గొంటారు.

ఈ చిత్రం డిసెంబరు 3న రిలీజ్‌ కానుంది. కాగా ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘స్పిరిట్‌’. ‘ఫౌజీ’ సినిమాలో తన షూటింగ్‌ పూర్తయిన తర్వాత జెట్‌ స్పీడ్‌తో ‘స్పిరిట్‌’ చిత్రీకరణను పూర్తి చేస్తారు ప్రభాస్‌. ఈ చిత్రం 2027 మార్చి 5న రిలీజ్‌ కానుంది. ‘స్పిరిట్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యాక ‘కల్కి 2’ సినిమా షూట్‌లో ప్రభాస్‌ జాయిన్‌ అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement