థ్రిల్‌ రెడీ | Amen Movie Releasing Worldwide on July 24 | Sakshi
Sakshi News home page

థ్రిల్‌ రెడీ

Jul 21 2026 12:08 AM | Updated on Jul 21 2026 12:08 AM

Amen Movie Releasing Worldwide on July 24

నూతన తారలతో ఎస్‌కే బషీద్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘ఆమెన్‌’. రేగుల నీరజారాణి సమర్పణలో ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై ఆర్‌ఎన్‌ఆర్‌ డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.

ఈ సంద ర్భంగా ఎస్‌కే బషీద్‌ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, థ్రిల్, హారర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఆమెన్‌’. ఇప్పటి వరకు వచ్చిన హారర్‌ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా మా మూవీ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్, భయానక అంశాలతో ప్రేక్షకులను థ్రిల్‌ చేయబోతున్నాం. కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం. ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉండటంతో మేమే విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement