దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. రాజకీయాలకు ముందు ఆయన నటించిన చివరి చిత్రమిదే. ఈ మూవీనే తన ఆఖరి సినిమా అని కూడా విజయ్ విజయ్ ప్రకటించారు. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఇప్పటికే ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
తాజాగా జన నాయగన్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు మేకర్స్. జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ మేరకు విజయ్ పోలీస్ డ్రెస్‌లో పోస్టర్ షేర్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది.
Tested by fire.
Forged by time.
Built for history.
The tougher the battle,
The louder the victory.#JanaNayaganFromJuly23#JanaNayakuduFromJuly23#JanNetaFromJuly23
The Hon'ble Chief Minister @actorvijay @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol… pic.twitter.com/21xjixgUBM— KVN Productions (@KvnProductions) July 15, 2026


