మధ్య తరగతి కష్టాలను చెప్పడం గొప్ప కళ: శ్రీకాంత్‌ | Mister Middle Class Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

మధ్య తరగతి కష్టాలను చెప్పడం గొప్ప కళ: శ్రీకాంత్‌

Jul 15 2026 1:17 AM | Updated on Jul 15 2026 1:17 AM

Mister Middle Class Movie Pre Release Event

నాగేశ్వర్‌ రెడ్డి, శ్రీకాంత్‌

‘‘మధ్యతరగతి వాళ్లు పడే కష్టాలను వినోదాత్మకంగా చెప్పడం ఒక గొప్ప కళ. ఆ విషయంలో నాగేశ్వర్‌ రెడ్డిగారు అద్భుత విజయం సాధించారు. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడికే చెప్పుకుంటాం. అలాంటి నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన ‘మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌’లో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్‌. జి. నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, లయ జంటగా రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌’. జీకే–సీఎన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్, ట్రైలర్‌ విడుదల వేడుకకు దర్శకులు వీవీ వినాయక్, దశరథ్, రచయిత కోన వెంకట్‌ ముఖ్య అతిథులుగా హాజరై, ‘మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌’ ట్రైలర్‌ సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఈ మూవీ మిడిల్‌ క్లాస్‌ని మాత్రమే కాదు... అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అని పేర్కొన్నారు. జి. నాగేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘శ్రీకాంత్‌ మరో బ్లాక్‌బస్టర్‌ సాధించబోతున్నారని గ్యారెంటీగా చెబుతున్నాను’’ అని తెలిపారు. ‘‘మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌’ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత చందు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement