కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టాక్సిక్..ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ పాన్-ఇండియన్ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. మరి బోల్డ్‌గా ఉన్నాయంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఈ సినిమా సంగతి పక్కన పెడితే యశ్ నెక్ట్స్ మూవీపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే యశ్ తదుపరి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరన్న విషయంపై శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సప్త సాగరదాచే ఎల్లో మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు హేమంత్ ఎం రావుతో జతకట్టనున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ విషయాన్ని ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ తన పేజీలో ప్రస్తావించింది. దీంతో ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మూవీని ఓ ఆర్మీ జవాన్.. పోలీసుగా మారిన కథాంశంగా తెరకెక్కించనున్నారని ఐఎండీబీ తన పేజీలో పేర్కొంది.
ఈ సినిమాకు హేమంత్ ఎం రావుతో పాటు యశ్ రచయితగా ఉండడం మరో విశేషం. ఈ మూవీని కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతాల నిర్మించనున్నారు. అయితే ఈ విషయంపై యశ్ కానీ, హేమంత్ ఎం రావు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హేమంత్ ఎం రావు ప్రస్తుతం '666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో బిజీగా ఉన్నారు.


