పెద్ది తర్వాత ప్రాజెక్ట్‌లో చిరంజీవి హీరోయిన్.! | Nayanathara acts In Ram charan Next crazy project with ram charan | Sakshi
Sakshi News home page

Ram Charan: పెద్ది తర్వాత ప్రాజెక్ట్‌.. చిరంజీవి హీరోయిన్ కూడా..!

Jul 14 2026 5:35 PM | Updated on Jul 14 2026 6:14 PM

Nayanathara acts In Ram charan Next crazy project with ram charan

పెద్ది తర్వాత రామ్ చరణ్ మూవీపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కించారు. జూన్ 4న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించింది.

ఈ సినిమా సంగతి పక్కనపెడితే.. రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ సుకుమార్‌తో చేయనున్నారు. వీరిద్ది కాంబోలో వస్తోన్న ఆర్సీ17 చిత్రంపై తాజాగా ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని లేటేస్ట్ టాక్. అయితే ఆమె హీరోయిన్‌గా కాకుండా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నయనతార ఎంట్రీ ఇస్తే RC17పై అంచనాలు మరింత పెరగనున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement