రామ్ చరణ్ కొత్త లగ్జరీ ఫామ్ హౌస్! | Ram Charan Builts New Luxary Farm House Near Mokila Hyderabad | Sakshi
Sakshi News home page

Ram Charan: మెగా హీరో ఫామ్ హౌస్.. గృహప్రవేశానికి సిద్ధం!

Jul 14 2026 2:51 PM | Updated on Jul 14 2026 2:57 PM

Ram Charan Builts New Luxary Farm House Near Mokila Hyderabad

గత నెలలో 'పెద్ది' సినిమాతో వచ్చిన రామ్ చరణ్.. ‍రూ.400 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. తర్వాత సుకుమార్ తీయబోయే కొత్త మూవీలో నటించబోతున్నాడు. అది షూటింగ్ మొదలై, రిలీజ్ కావడానికి మరో రెండేళ్లు అయినా పట్టొచ్చు. ఈ సంగతి అలా ఉంచితే మరో విషయమై చరణ్ వార్తల్లో నిలిచాడు. కొత్తగా నిర్మించుకున్న ఫామ్ హౌస్ దీనికి కారణం.

(ఇదీ చదవండి: తండ్రి దళపతి విజయ్ కోసం తగ్గిన కొడుకు)

హైదరాబాద్ శివారులోని చేవెళ్ల-మోకిల పరిసర ప్రాంతంలో చాన్నాళ్ల క్రితమే చరణ్-ఉపాసన 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులోనే విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ని ఇప్పుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే గృహప్రవేశం కూడా చేయబోతున్నారని టాక్.

ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్లే ఇంటీరియర్, పచ్చదనం, ఆర్కిటెక్చర్ లాంటివి ఈ ఫామ్‌హౌస్‌లో ఉండబోతున్నాయట. లగ్జరీ రూమ్స్, స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలతో ప్రైవేట్ రిసార్ట్‌ని తీర్చిదిద్దుతున్నారట. వీకెండ్స్ గడపడానికే కాకుండా ప్రకృతి సేద్యం చేయడానికి అనువైన రీతిలో దీని డిజైన్ ఉందట. ఈ ఐదు ఎకరాల స్థలంలో కొంత భాగాన్ని ఫామ్‌హౌస్ కోసం ఉపయోగించి మిగిలిన దానిలో సొంతంగా కూరగాయాలు, పండ్లు పెంచాలనేది చరణ్ ప్లాన్ అని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఆ సంస్థతో ఎన్టీఆర్ కి సంబంధం లేదు.. టీమ్ క్లారిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement