'మా ముందే దుస్తులు వేసుకోవచ్చుగా?'.. హీరోయిన్‌కు చేదు అనుభవం | Bollywood actress Zareen Khan slammed the paparazzi asked try the dress | Sakshi
Sakshi News home page

Zareen Khan: 'మా ముందే ట్రయల్ వేయండి'.. హీరోయిన్‌కు చేదు అనుభవం

Jul 14 2026 6:12 PM | Updated on Jul 14 2026 6:28 PM

Bollywood actress Zareen Khan slammed the paparazzi asked try the dress

సల్మాన్​ ఖాన్‌ 'వీర్‌' (2010) సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్‌ ఖాన్‌. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఐటం సాంగ్స్‌తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత హౌజ్‌ఫుల్‌ 2, హేట్‌ స్టోరీ 3, అక్సర్‌ 2తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించింది.   ఇక తెలుగులో గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలో జరీన్‌ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించింది.

ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో పెద్దగా చేయకపోయినా జరీన్ ఖాన్.. తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్‌లో మెరిసింది.  ఓ క్లాత్ స్టోర్ ఓపెనింగ్‌కు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా డ్రెస్సులు చూస్తున్న జరీన్ ఖాన్‌ను ఓ ఫొటోగ్రాఫర్ అసభ్యకర ప్రశ్న వేశారు. ఈ డ్రెస్ మీరు ట్రయల్ వేయొచ్చుగా అని అడగాడు. దీంతో ఆమె వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి.. మీ ముందేనా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.. మీ హద్దులు దాటొద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement