ది ఒడిస్సీ క్రేజ్.. ఒక్కో టికెట్ ధర అన్ని వేలా? | Christopher Nolan The Odyssey Ticket Prices In Mumbai and delhi areas | Sakshi
Sakshi News home page

The Odyssey: ది ఒడిస్సీ క్రేజ్.. ఒక్కో టికెట్ ధర అన్ని వేలా?

Jul 14 2026 9:42 PM | Updated on Jul 14 2026 9:42 PM

Christopher Nolan The Odyssey Ticket Prices In Mumbai and delhi areas

హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు ఇండియాలోనూ క్రేజ్ ఉంది. గతంలో ఆయన తెరకెక్కించిన ఓపెన్ హైమర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణించింది. అదే ఊపులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన దర్శకత్వలో వస్తోన్న లేటేస్ట్ మూవీ ది ఒడిస్సీ. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ముంబయిలో సందడి చేశారు. తన టీమ్‌తో కలిసి ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంబయి వీధుల్లో క్రిస్టోఫర్ నోలన్ ఎంజాయ్ చేశారు. మ్యాట్ డామన్, టామ్ హాలండ్ నటించిన ఈ మూవీ కోసం ఇండియన్ ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీగా టికెట్ రేట్లు..

అదే సమయంలో ఈ మూవీ క్రేజ్ దృష్ట్యా టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. ముంబయిలోని ఐమ్యాక్స్‌, మల్టీప్లెక్స్ థియేటర్లలో రిక్లైనర్ సీట్ రేటు ఏకంగా రూ. 3,100 గా ఫిక్స్ చేశారు. ఇక ఢిల్లీ విషయానికొస్తే పీవీఆర్, సెలెక్ట్ సిటీ వాక్ లాంటి మల్టీప్లెక్సుల్లో రిక్లైనర్ టికెట్ ధరలు ఏకంగా రూ.2,500 వరకు ఉన్నాయి. అదే థియేటర్లలో సాధారణ సీట్స్ కూడా రూ.1,000 నుంచి రూ. 2,100 వరకు రేట్లు నిర్ణయించారు. ఇంతలా భారీ రేట్లు చూసిన ఆడియన్స్ టికెట్లు కొనేందుకు కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.

చెన్నైలో చాలా తక్కువ..

ముంబయి, ఢిల్లీ నగరాలను మినహాయిస్తే బెంగళూరు, చెన్నైలో, కోల్‌కతా, హైదరాబాద్‌లో టికెట్ ధరలు కాస్తా తక్కువగానే ఉన్నాయి. బెంగళూరులోని మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ రూ. 1,200 నుంచి రూ. 1,950 మధ్య ఉండగా.. కోల్‌కతాలో రూ.1,100 - 1,240 వరకు పెంచేశారు. చెన్నైలో మాత్రం ఐమాక్స్‌లో కూడా గరిష్టంగా రూ. రూ.508కే ది ఒడిస్సీ టికెట్లు లభిస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement