'మాకు సీఎం కేక్ కావాలి'.. విజయ్ బర్త్ డేకు జాక్‌పాట్ | CM Vijay birthday cake becomes a hit in Chennai big orders | Sakshi
Sakshi News home page

CM Vijay: 'త్రిష తెచ్చిన కేక్.. అతనికి బాగా కలిసొచ్చింది'

Jul 17 2026 6:53 PM | Updated on Jul 17 2026 7:29 PM

CM Vijay birthday cake becomes a hit in Chennai big orders

దళపతి విజయ్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిసారే సీఎం కావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలే విజయ్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో అభిమానులు పండుగలా జరుపుకున్నారు. హీరోయిన్ త్రిష సైతం విజయ్‌ బర్త్ డే రోజు కేక్ కట్ చేయించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

అయితే విజయ్ పుట్టినరోజు ఓ బేకర్ యజమానికి అనూహ్యంగా కలిసొచ్చింది. జూన్ 22న నటి త్రిష పంచుకున్న పుట్టినరోజు ఫోటోలో తమ కేక్ కనిపించిందని యజమాని తన్వి బొకారియా తెలిపారు. ఆ రోజు నుంచే ఆ ఫోటోలోని మామిడి వెనీలా కేక్‌ కోసం విపరీతంగా డిమాండ్ పెరిగిందన్నారు. ఆ తర్వాత వరుసగా రెండు వారాల్లో అదే కేక్ కోసం సుమారు 300 నుంచి 400 ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు.

బేకర్ యజమాని మాట్లాడుతూ.. "మాకు రాత్రికి రాత్రే గొప్ప క్రేజ్ వచ్చింది. ఆ కేక్ ఏ సందర్భం కోసమో మాకు అస్సలు తెలియదు. అది చాలా ప్రత్యేకమైనది.. నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. రెండు వారాలుగా అమ్మకాలతో చాలా బిజీగా ఉన్నాం. అందుకు నేను కృతజ్ఞతతో ఉన్నా. నా బృందం సీఎం జోసెఫ్ విజయ్‌ వీరాభిమానులు" అని అన్నారు. ప్రస్తుతం మామిడి కేక్ బదులు సీఎం కేక్ కావాలని కస్టమర్స్ అడుగుతున్నారని బొకారియా అన్నారు. కాగా.. విజయ్ సీఎం అయ్యాక త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement