ఒడిస్సీలా మనం ఎందుకు చేయలేం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్ | Akkineni Nagarjuna comments at Lenin Movie Success Meet | Sakshi
Sakshi News home page

Akkineni Nagarjuna: ఒడిస్సీలా మనం ఎందుకు చేయలేం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్

Jul 20 2026 9:22 PM | Updated on Jul 20 2026 9:22 PM

Akkineni Nagarjuna comments at Lenin Movie Success Meet

అక్కినేని అఖిల్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన యాక్షన్‌ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లింది. ఏజెంట్ తర్వాత అఖిల్‌కు హిట్ పడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన నాగార్జున టాలీవుడ్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ముఖ్యంగా సినిమా రిలీజ్ డేట్స్ విషయంపై నాగార్జున కాస్తా ఘాటు కామెంట్స్ చేశారు. ఒడిస్సి మూవీ ఏడాది కిందట రిలీజ్ డేట్ ప్రకటించి అదే తేదీకి విడుదల చేశారు. కానీ మనం రిలీజ్ డేట్ ప్రకటించినా ఆ టైమ్‌కు రిలీజ్ చేయలేకపోతున్నామని అన్నారు. లెనిన్ విషయంలోనూ అదే జరిగిందని తెలిపారు. గతంలో నెల రోజుల ముందే రిలీజ్ కాపీని చూసేవాళ్లమని నాగ్ వెల్లడించారు. ఇప్పుడు అలా ఎందుకు చూడలేకపోతున్నామనేదే నా ప్రశ్న అని అన్నారు. ప్రకటించిన తేదీకే అందరు సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందని నాగార్జున తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాను కనీసం రెండు వారాల ముందు ఇస్తే బాగుంటుందని నాగ్ అన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement