మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్.. ఆసక్తిగా ట్రైలర్ | Marvel Studios Avengers Doomsday Trailer Out now | Sakshi
Sakshi News home page

Avengers: Doomsday: మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్.. ఆసక్తిగా ట్రైలర్

Jul 20 2026 9:09 PM | Updated on Jul 20 2026 9:13 PM

Marvel Studios Avengers Doomsday Trailer Out now

సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హాలీవుడ్‌ ఫ్రాంచైజీల్లో అవెంజర్స్‌ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ అవెంజర్స్‌: డూమ్స్‌డే. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్‌గా కాకుండా.. డాక్టర్ డూమ్‌గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి తిరిగి వస్తున్నారు. ఈ చిత్రంలో క్రిస్‌ హమ్స్‌వర్త్, వెనెస్సా కిర్బీ  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్‌లో యాక్షన్‌ సీన్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్‌లో డౌనీ రూపాంతరం, అవెంజర్స్‌తో సంఘర్షణ, ఇవాన్స్ కనిపించడం హైలెట్‌గా నిలిచాయి. అవెంజర్స్: డూమ్స్‌డే మూవీ కోసం దర్శకులు జో, ఆంథోనీ రుస్సోలతో మార్వెల్ మళ్లీ కలిశారు. 2019లో వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత వీరు మొదటిసారిగా తిరిగి వస్తున్నారు. ఈ చిత్రానికి మైఖేల్ వాల్డ్రాన్, స్టీఫెన్ మెక్‌ఫీలీ రచయితలుగా ఉన్నారు. రుస్సో బ్రదర్స్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబరు 18న విడుదల కానుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement