'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నిర్మాత నిహారిక కొణిదెల స్పందించారు. నా సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో రుద్రవీణకు నాగబాబు అవార్డు అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా తన సినిమాకు అవార్డ్ రావడంపై చిరంజీవి, సురేఖ ప్రశంసించారని నిహారిక ఆనందం వ్యక్తం చేసింది.
నన్ను చూస్తుంటే గర్వంగా ఉందని పెదనాన్న చిరంజీవి అనడంపై నిహారిక ఆనందం వ్యక్తం చేసింది. మన ఇండస్ట్రీకి ఇది గొప్ప గర్వకారణమన్నారు. ఆయనే మన ఇండస్ట్రీకి ప్రైడ్ అని ఫీలవుతుంటానని తెలిపింది. ఆయన నన్ను తోపు అంటుంటే.. నేను కూడా నిజంగానే తోపు అని ఫీలవుతా కదా అని సరదాగా మాట్లాడింది.
కాగా.. నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి జాతీయ అవార్డ్ దక్కింది.


