బిగ్‌బాస్ బ్యూటీకి అసభ్యకర సందేశాలు.. పోలీసులకు ఫిర్యాదు | Bigg Boss contestant files police complaint over online harassment | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్ బ్యూటీకి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Jul 20 2026 7:49 PM | Updated on Jul 20 2026 7:54 PM

Bigg Boss contestant files police complaint over online harassment

కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్ ఐశ్వర్య పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదు చేసింది. ఆన్‌లైన్‌లో వేధింపులు, దుర్భాషలు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించింది. తనకు తెలిసిన ఒక వ్యక్తి పేరును వెల్లడిస్తూ.. పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి తనను లక్ష్యంగా చేసుకున్నారని వాపోయింది.

తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు తెలిపింది. దీని వెనుక ఉన్నవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. దీంతో బెంగళూరులోని సంజయ్‌నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వేధింపులు చాలా కాలంగా కొనసాగుతున్నాయని.. అందుకే తాను మరోసారి పోలీసులను ఆశ్రయించానని నటి తన ఫిర్యాదులో పేర్కొంది.

కాగా.. కన్నడ చిత్ర పరిశ్రమలో మహిళా నటీమణులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి రమ్య,  దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ కూడా ఇలాంటి ఆన్‌లైన్ ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు.  ఈ రెండు కేసుల్లోనూ నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు కూడా చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement