ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్‌ అదుర్స్ | Operation Safed Sagar The Untold Story of the Kargil War Official Trailer | Sakshi
Sakshi News home page

Operation Safed Sagar: ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్‌ అదుర్స్

Jul 20 2026 7:08 PM | Updated on Jul 20 2026 7:19 PM

Operation Safed Sagar The Untold Story of the Kargil War Official Trailer

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో వెబ్ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.

కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు, వైమానిక దాడులు ఆకట్టుకునేలా ఉన్నాయి.  1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్‌ పేరే సఫేద్ సాగర్. పాకిస్తాన్‌పై వైమానిక దాడులతో మంచు కొండలపై భారత్ ‍విరుచుకుపడినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ది గోల్డెన్ యారోస్ కీలక పాత్ర పోషించింది.

కాగా.. ఈ సిరీస్‌లో సిద్దార్థ్‌, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా కనిపించనున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement