breaking news
Operation Safed Sagar
-
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా దూకుడు రీ రిలీజ్ (ఆగస్టు 09) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ చాలానే క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. జాబితాలో దాదాపు 23 వరకు మూవీస్, సిరీస్‌లు ఉన్నాయి. వాటిలో లెనిన్, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి హిట్స్ ఉన్నాయి. వీటికి తోడు ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 03 నుంచి 09 వరకు)జీ5లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07అమెజాన్ ప్రైమ్ఈవిల్ డెడ్ బర్న్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 04 (రెంట్)స్టెర్లింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07నెట్ఫ్లిక్స్బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04బిగ్ చికెన్: ఏ ఫాస్ట్‌ఫుడ్ కాన్సిపరసీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05ఇన్సైడ్ ద ట్రస్టెడ్ స్కాండల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08హాట్స్టార్ఉయిర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 04ద షార్డ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07మనోరమ మ్యాక్స్కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 07ఆపిల్ టీవీ ప్లస్టెడ్ లాసో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
ఆపరేషన్ సఫేద్ సాగర్.. ఆమె మాటలకు సిద్ధార్థ్ ఎమోషనల్
కార్గిల్ యుద్ధ నేపథ్యంలోనే వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999లో జరిగిన కార్గిల్ వార్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న సిరీస్ కావడంతో వైమానికి విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబయిలో నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ ఎమోషనలయ్యారు. దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా భార్య అల్కా అహుజా ట్రైలర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కా అహుజాను వేదికపైకి ఆహ్వానించారు. అదే సమయంలో ప్రేక్షకులంతా ఆమెకు గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. తన భర్త కథను తెరపైకి తీసుకువచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాటలు స్పష్టంగా సిద్ధార్థ్‌ను కదిలించాయి.. దీంతో ఆయన వేదికపై కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సిరీస్‌పై నమ్మకం ఉంచినందుకు సిద్ధార్థ్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత యుద్ధ వీరుడి పాత్రను పోషించడానికి తాను మొదట్లో సంకోచించానని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం మన మధ్య లేని వారి పాత్రను.. ముఖ్యంగా ఒక అమరవీరుడి పాత్రను పోషించినప్పుడు మనపై చాలా పెద్ద బాధ్యత ఉంటుందని అన్నారు. హీరోలు ఎప్పుడూ హీరోల్లా కనిపించరు. వారు తమ చర్యల వల్లే హీరోలవుతారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ అంగీకరించే ముందు తాను ఈ సిరీస్ నిర్మాతలతో చాలాసార్లు చర్చించానని వెల్లడించారు. ఆయన భార్య అల్కా అహుజా అనుమతించారా?' అదే నాకు అత్యంత ముఖ్యమని మేకర్స్‌తో చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా.. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రస్తుత, పదవీ విరమణ పొందిన భారత వైమానిక దళ అధికారులు కూడా హాజరయ్యారు.అజయ్ అహుజా ఎవరంటే..స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన ఒక భారత వైమానిక దళ అధికారి. కూలిపోయిన విమానంలో తోటి పైలట్‌ను గుర్తించే మిషన్‌లో ఉండగా ఆయన విమానం కూల్చివేశారు. అహుజాకు ఆయన ధైర్యసాహసాలకు, సేవకు గాను మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. ఆయనను ఆపరేషన్ సఫేద్ సాగర్‌లోని కీలక వ్యక్తులలో ఒకరిగా గుర్తుంచుకుంటారు. ఈ సిరీస్ కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం పోషించిన పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్త కోలి, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్ అదుర్స్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ట్రైలర్లో యుద్ధ సన్నివేశాలు, వైమానిక దాడులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ పేరే సఫేద్ సాగర్. పాకిస్తాన్‌పై వైమానిక దాడులతో మంచు కొండలపై భారత్ విరుచుకుపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ది గోల్డెన్ యారోస్ కీలక పాత్ర పోషించింది.కాగా.. ఈ సిరీస్‌లో సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా కనిపించనున్నారు. -
ఓటీటీలోకి మిలిటరీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్పై ప్రకటన
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మూవీస్‌ని తలపించే కథలని సిరీస్‌లుగా తీస్తుంటారు. అలా రాబోతున్నదే 'ఆపరేషన్ సఫేద్ సాగర్'. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కొన్నిరోజుల క్రితం ఓ టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు మరొకటి వదిలారు. అలానే స్ట్రీమింగ్ తేదీ గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' అప్డేట్ ఇచ్చిన సీఎం విజయ్)హీరో సిద్దార్థ్‌తో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్.. వచ్చే నెల 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో చూస్తే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చూడాలనే కుతుహలాన్ని కలిగిస్తున్నాయి. ఇందులో సిద్ధార్థ్.. ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా నటించాడు.ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేది 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన చారిత్రక వైమానిక దాడికి పెట్టిన పేరు. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో 'ది గోల్డెన్ యారోస్' కీలక పాత్ర పోషించింది. శత్రువులు దాక్కున్న మంచు కొండలపై భారత బలగాలు జరిపిన ఈ సాహసోపేతమైన పోరాటం ఆధారంగా ఈ పేట్రియాటిక్ మిలిటరీ వార్ డ్రామా తీయడం విశేషం.(ఇదీ చదవండి: ఉదయం అమ్మాయిలా, రాత్రి మగాడిలా.. ఓటీటీలోకి వచ్చేసిన ఫాంటసీ కామెడీ సినిమా)


