ఓటీటీలోకి మిలిటరీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్‌పై ప్రకటన | Operation Safed Sagar Series Ott Release Date | Sakshi
Sakshi News home page

OTT: ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా సిద్ధార్థ్.. టీజర్ రిలీజ్

Jul 11 2026 4:11 PM | Updated on Jul 11 2026 4:15 PM

Operation Safed Sagar Series Ott Release Date

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మూవీస్‌ని తలపించే కథలని సిరీస్‌లుగా తీస్తుంటారు. అలా రాబోతున్నదే 'ఆపరేషన్ సఫేద్ సాగర్'. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కొన్నిరోజుల క్రితం ఓ టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు మరొకటి వదిలారు. అలానే స్ట్రీమింగ్ తేదీ గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు.

(ఇదీ చదవండి: 'జన నాయగణ్'‍ అప్‌డేట్ ఇ‍చ్చిన సీఎం విజయ్)

హీరో సిద్దార్థ్‌తో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్.. వచ్చే నెల 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో చూస్తే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చూడాలనే కుతుహలాన్ని కలిగిస్తున్నాయి. ఇందులో సిద్ధార్థ్.. ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా నటించాడు.

ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేది 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన చారిత్రక వైమానిక దాడికి పెట్టిన పేరు. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో 'ది గోల్డెన్ యారోస్' కీలక పాత్ర పోషించింది. శత్రువులు దాక్కున్న మంచు కొండలపై భారత బలగాలు జరిపిన ఈ సాహసోపేతమైన పోరాటం ఆధారంగా ఈ పేట్రియాటిక్ మిలిటరీ వార్ డ్రామా తీయడం విశేషం.

(ఇదీ చదవండి: ఉదయం అమ్మాయిలా, రాత్రి మగాడిలా.. ఓటీటీలోకి వచ్చేసిన ఫాంటసీ కామెడీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement