‘లెనిన్’తో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె భారతి అనే పాత్రను పోషించింది. జులై 10న ఈ చిత్రం విడుదల కాగా.. తొలి రోజు హిట్ టాక్ వచ్చింది. అఖిల్‌తో పాటు భాగ్యశ్రీ నటనపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరి కృషి వల్లే ఈ సినిమా విజయం సాధించిందన్నారు భాగ్యశ్రీ.
తాజాగా ఈ సినిమా టీమ్ సక్సెస్‌లో మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. అభిమానుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది. ‘లెనిన్’టీమ్‌తో ఏడాదిన్నర పాటు జర్నీ చేశాను. ప్రతి ఒక్కరు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. మీ(ఫ్యాన్స్) వల్లే నేను ఇక్కడ ఉన్నాను’ అంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు పెట్టుకుంది. హైదరాబాద్ తన కర్మభూమి అని.. తన చివరి సినిమా కూడా తెలుగులోనే చేయాలాని కోరుకుంటున్నానని చెప్పింది.
Bhagyashri ఎమోషనల్ అయిపోయింది.
సోషల్ మీడియాలో చాలా Casual గా మాటలు అనేస్తారు But it will cause deep mental agony. Be considerate! #Lenin pic.twitter.com/lOHJFY38Ai— Journalist Nishant (@NishantOpinions) July 11, 2026


