శ్రీలీల ఇన్‌స్ట్రాగామ్‌ ఆదాయం ఎంతో తెలుసా? | Sreeleela Instagram Earnings 2026, How The Actress Is Reportedly Making Lakhs Through Brand Promotions | Sakshi
Sakshi News home page

శ్రీలీల ఇన్‌స్ట్రాగామ్‌ ఆదాయం ఎంతో తెలుసా?

Jul 11 2026 8:21 AM | Updated on Jul 11 2026 10:03 AM

Sreeleela Earning Huge Amount From Instagram

తమిళంలో ఒక సామెత ఉంది ప్రభుత్వం ఉద్యోగులకు సంబళం కంటే గింబళం ఎక్కువ అని. అంటే జీతం కంటే పైన వచ్చే ఆదాయమే అధికం అని అర్ధం. అలా ఇప్పుడు మనం హీరోయిన్ల పారితోషికంతో పాటు ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చేతి నిండా సంపాదిస్తున్నారు. అందుకు చిన్న ఉదాహరణ నటి శ్రీలీల. కన్నడ సినీ రంగం నుంచి నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ తర్వాత పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. అలా తొలి చిత్రంతోనే తన చలాకి నటన, రంజింపజేసే డ్యాన్స్‌తో కుర్రకారును ఆకట్టుకున్నారు. 

అలా అక్కడ క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ భామ పరాశక్తి చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్రేజీ ఆఫర్లను అందుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి పాన్‌ ఇండియా కథానాయకిగా ఎదిగారు. దీంతో కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. 

యూత్‌ ఫుల్‌ క్రేజ్‌ హీరోయిన్లకు ఇన్‌స్ట్రాగామ్‌ ఫాలోవర్స్‌ మామూలుగా ఉండరు. అలా శ్రీలీలకు 17 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. దానికి ప్రతిఫలాన్ని శ్రీలీల అధికంగానే పొందుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. పలు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ప్రకటనలను శ్రీలీల ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రచారం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందుకు రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. అలా ఈ అమ్మడు నెలకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement