అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ హీరో బాబు' (తమిళంలో ‘సూపర్ హీరో’). ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత కేఎస్ సినిష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సమర్పణలో 'రెడాక్టెడ్ స్టూడియోస్'కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
అర్జున్ దాస్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓజీ మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి అర్జున్ దాస్ సూపర్ హీరో బాబు చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తేజు అశ్విని కనిపించనుంది. ఈ చిత్రంతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు.
Super Hero Babu.. Title & Poster 👌 @sinish_s presents #SUPERHERO BABU
A commercial family entertainer.@iam_arjundas @iamSandy_Off #SuperHeroBabu pic.twitter.com/XPkx6Rp4kW— H A N U (@HanuNews) July 10, 2026


