అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచో హిట్ కోసం తంటాలు పడుతోన్న అఖిల్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.
అందుకు తగ్గట్టుగానే లెనిన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన చిత్రానికి హిట్ టాక్ రావడంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అఖిల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి నాగార్జునను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ కట్ చేస్తుండగా నాగార్జున కాళ్లకు నమస్కరించిన అఖిల్.. ఆయనతో గట్టిగా కౌగిలించుకుని ఎమోషనలయ్యారు. ఈ వీడియోను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.
A blockbuster on screen.
A priceless moment off screen. ❤️
A hug that spoke louder than words…#LENIN #BlockbusterLENIN
Book your tickets now 🎫 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla… pic.twitter.com/YHgBKwEmBI— Sithara Entertainments (@SitharaEnts) July 10, 2026


