సినీ ఇండస్ట్రీలో విషాదం.. జాతీయ అవా‍ర్డ్ డైరెక్టర్ కన్నుమూత | National award winner Tamil director Chezhiyan passed away | Sakshi
Sakshi News home page

Chezhiyan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఇకలేరు

Jul 10 2026 4:20 PM | Updated on Jul 10 2026 4:25 PM

National award winner Tamil director Chezhiyan passed away

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్ చెజియాన్‌(57) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటనతో కోలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. చెన్నైలోని తారామణిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ ప్రముఖులు, అభిమానులు డైరెక్టర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కేవలం డైరెక్టర్‌గా మాత్రమే కాదు.. సినిమాటోగ్రాఫర్‌గా రాణించారని కొనియాడుతున్నారు. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాని పోస్టులు పెడుతున్నారు.

కాగా.. తమిళనాడులోని శివగంగైలో జన్మించిన చెజియాన్.. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత తనకున్న అభిరుచితో సినీ జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ వద్ద సహాయకుడిగా కెరీర్ మొదలెట్టారు. ఆ తర్వాత 2007లో 'కల్లూరి' చిత్రంతో  సినిమాటోగ్రాఫర్‌గా అరంగేట్రం చేశారు. ‍అనంతరం 'రెట్టైసుళి', 'తెన్మెర్కు పరువకాట్రు', 'మగిళ్చి', 'పరదేశి', 'జోకర్' వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'పరదేశి' సినిమాకు గానూ 2013లో లండన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు లభించింది.

ఆ తర్వాత ఆయన 'టు లెట్' అనే చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రం జాతీయ సీనీ పురస్కారాన్ని గెలుచుకోవడంతో పాటు.. పలు అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకుంది. ఆయన సినిమాలతో పాటు రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు పాఠకులకు ప్రపంచ సినిమాను పరిచయం చేయగా.. ఆయన చిత్రాలు వాస్తవికత, భావోద్వేగం, కళాత్మక నిజాయితీ పట్ల నిబద్ధతను ప్రతిబింబించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement