నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం ఎంఆర్‌పీ. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్. ఈ సినిమాకు శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ డోనాల్ బిస్తీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నలుగురు స్నేహితులు కలిసి చేసే కామెడీ ఆడియన్స్‌ను అలరించేలా ఉండనుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాకు అజయ్ అరసాడ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో కసిరెడ్డి రాజ్ కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృధ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా చూసేయండి.


