ఓటీటీల్లో వీకెండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies List Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: ఓటీటీల్లో వీకెండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్.. 14 చిత్రాలు స్ట్రీమింగ్..!

Jul 9 2026 8:09 PM | Updated on Jul 9 2026 8:59 PM

This Friday Ott Release Movies List Goes Viral On Social Media

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో అఖిల్ అక్కినేని సందడి చేయనున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లెనిన్ మూవీ జూలై 10న బాక్సాఫీస్ బరిలో నిలవనుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ యాక్షన్‌ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లెనిన్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటించిన తమిళ మూవీ హృదయం మురళి థియేటర్లలో అలరించనుంది.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. ఇప్పటికే పెద్ది నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తుండగా..  పతి పత్ని ఔర్ వో దో , ఇక్కా లాంటి బాలీవుడ్ మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పాటు డోస్ లాంచి మలయాళ థ్రిల్లర్‌ సినిమా ఓటీటీకి రానుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్

  • పెద్ది(తెలుగు సినిమా)- జూలై 09

  • సింగ్‌ గీతం(తెలుగు సినిమా)- జూలై 09

  • లిటిల్ హౌస్‌ ఆన్ ది ప్రైయరీ(హాలీవుడ్)- జూలై 09

  •  గుర్తుకొస్తున్నాయి(తెలుగు వెబ్ సిరీస్)- జూలై 10

  •  పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10

  •  ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10

  •  షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10

  •  ద అపార్ట్‌మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11

  •   సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12


జియో హాట్‌స్టార్

  •    ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10

  •    ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్(మలయాళ సినిమా)- జూలై 10


సోనీ లివ్

  •    బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10

అమెజాన్ ప్రైమ్

  •    డోస్(మలయాళ సినిమా)- జూలై 10

  •   ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12

జీ5

  •    ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10

  •    పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) - జూలై 10

లయన్స్ గేట్ ప్లే

  •    ద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 10

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement